Nellore: పేదలకు అండగా నారాయణ కుటుంబం.. నెల్లూరులో తోపుడు బండ్ల పంపిణీ
Nellore: నెల్లూరు సిటీలో చిరు వ్యాపారుల కోసం మంత్రి పొంగూరు నారాయణ కుటుంబం అండగా నిలుస్తోంది.
Nellore: పేదలకు అండగా నారాయణ కుటుంబం.. నెల్లూరులో తోపుడు బండ్ల పంపిణీ
Nellore: పేదలకు ఎప్పుడూ అండగా నారాయణ కుటుంబం నిలుస్తుందని చెప్పారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు షరణి...
అర్హులైన చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. నెల్లూరు సిటీలో సంక్షేమ వెల్లువ కొనసాగుతుందని చెప్పారు. పేదలు, కార్యకర్తల కోసం 50 కోట్ల నిధి కేటాయించడం జరిగిందన్నారు. వీధి వ్యాపారులకు ఆపన్నహస్తం అందించడమేనని, నాడు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ..వీధి వ్యాపారుల చేతుల్లో నేడు తోపుడు బండి పెట్టగలిగామని చెప్పారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నిరుపేద వీధి వ్యాపారులను ఆదుకునేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుటుంబం గొప్ప సంకల్పంతో ముందుకెళుతోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం తోపుడు బండ్ల అద్దెలు కట్టలేక, ఇబ్బంది పడుతున్న పేద వీధి వ్యాపారులకు విడతలవారీగా తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్నారు.తాజాగా మంగళవారం మంత్రి కుమార్తె పొంగూరు షరణి చేతుల మీదుగా 86 మందికి, ఉచితంగా తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షరణి మాట్లాడుతూ..
నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారే కావడంతో, పేదల కష్టాలు ఆయనకు బాగా తెలుసన్నారు.అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్న పేద వ్యాపారులకు ఇప్పటివరకు విడతల వారీగా 780 తోపుడు బండ్లను అందజేశామని తెలిపారు. పేదలు, కార్యకర్తల సంక్షేమం కోసం ఐదేళ్లలో 50 కోట్ల ప్రత్యేక నిధిని (ఏడాదికి 10 కోట్లు) కేటాయించినట్లు వెల్లడించారు.నెల్లూరు నగరాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపిస్తూనే, పేదలకు ఉచిత కార్పొరేట్ విద్య, వైద్యాన్ని అందిస్తున్నట్లు పొంగూరు షరణి పేర్కొన్నారు. విఆర్సీ తరహాలోనే నగరంలోని మరో 15 ప్రభుత్వ పాఠశాలలను త్వరలోనే కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించబోతున్నామని స్పష్టం చేశారు. అలాగే నారాయణ నేత్రజ్యోతి,దంత సురక్ష పథకాల ద్వారా ఇప్పటికే 7 వేల మందికి పైగా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. నమ్మి ఓట్లేసి గెలిపించిన సిటీ ప్రజల రుణం తీర్చుకుంటామని, తమను నమ్మిన ప్రతి ఒక్కరికీ నారాయణ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తమకు ఉపాధి కల్పించి అండగా నిలిచిన మంత్రి కుటుంబానికి లబ్ధిదారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సేవా కార్యక్రమంలో టీడీపీ డివిజన్ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు మరియు ముఖ్య నేతలు పాల్గొన్నారు.




