Nellore: వర్చువల్ మహానాడును విజయవంతం చేయండి.. మంత్రి పిలుపు
Nellore: మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా జరగనున్న వర్చువల్ (హైబ్రిడ్) మహానాడును విజయవంతం చేయాలని టిడిపి శ్రేణులకు మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.
Nellore: వర్చువల్ మహానాడును విజయవంతం చేయండి.. మంత్రి పిలుపు
Nellore: మహానాడును విజయవంతం చేయండి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. మెడికల్ కాలేజి క్యాంప్ కార్యాలయంలో మహానాడు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వర్చువల్ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని సిటీ టీడీపీ నేతలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దిశానిర్దేశం చేశారు.
క్లస్టర్ ల వారీగా నిర్వహించే మహానాడు లో పాల్గొనే క్యాడర్ కు ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలని సూచించారు.నెల్లూరు ప్రతిష్ఠను ఇనుమడింపచేసేలా ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ లోని క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం పార్టీ నాయకులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్చువల్ మహానాడు నిర్వహణపై సిటీ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు నేపథ్యంలో నెల్లూరులో జరగాల్సిన మహానాడును రద్దు చేసి, ఈ నెల 27,28 తేదీలలో మంగళగిరి లోని పార్టీ కేంద్రకార్యాలయం వేదికగా వర్చువల్ ద్వారా హైబ్రిడ్ మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు,వర్కింగ్ ప్రెసిడెంట్ యువనేత నారా లోకేష్ నిర్ణయించారని వివరించారు. వర్చువల్ మహానాడును విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.సిటీ నియోజక వర్గ పరిధిలోని 14 క్లస్టర్ లలో ఎల్ఈడి స్క్రీన్ లు ఏర్పాటు చేసి వర్చువల్ మహానాడు వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్చార్జీలు, కో క్లస్టర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు మరియు టిడిపి నేతలు పాల్గొన్నారు.




