Nellore: భివృద్ధికి నిలువెత్తు రూపం మంత్రి నారాయణ: మాజీ మున్సిపల్ చైర్పర్సన్!
Nellore: నెల్లూరు నగరంలో మంత్రి పొంగూరు నారాయణ శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ కొనియాడారు.
Nellore: భివృద్ధికి నిలువెత్తు రూపం మంత్రి నారాయణ: మాజీ మున్సిపల్ చైర్పర్సన్!
నెల్లూరు: అభివృద్ధి అంటే నారాయణ.. నారాయణ అంటే అభివృద్ధి అనే మాటకు దీటుగా నెల్లూరు నగరాన్ని మంత్రి పొంగూరు నారాయణ శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ కొనియాడారు.
గతంలో గాంధీ పార్క్, చిల్డ్రన్స్ పార్క్లకే పరిమితమైన వినోదాన్ని, నేడు నగరవ్యాప్తంగా ఏకంగా 46 అధునాతన పార్కులను ప్రజల ఇంటి వాకిట్లోకి తెచ్చిన ఘనత మంత్రి నారాయణ దేనని హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా 8వ డివిజన్లో 60-70 ఏళ్ల చరిత్ర కలిగి, గత 10-13 ఏళ్లుగా నిరుపయోగంగా మారి చెత్తకుప్పగా ఉన్న రేబాల వారి చిన్నపిల్లల ఆసుపత్రి స్థలాన్ని పండు అనే చిన్నారి అభ్యర్థన మేరకు పరిశీలించిన మంత్రి, అక్కడ అర ఎకరం విస్తీర్ణంలో 300 నుండి 400 మంది సామర్థ్యం గల అద్భుతమైన ఫంక్షన్ హాల్, మహిళలు-పురుషులకు ప్రత్యేక ఓపెన్ జిమ్‌లు, చిన్నారుల ఆట పరికరాలు మరియు ప్రశాంతమైన గార్డెనింగ్‌తో ఒక రూపశిల్పిలా నభూతో నభవిష్యత్ అన్నట్లుగా తీర్చిదిద్దారని కొనియాడారు.
పాడుబడిన ప్రాంతాన్ని నగరానికే తలమానికగా మార్చిన మంత్రి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఆదివారం నాడు వైభవంగా జరగబోయే ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి నెల్లూరు నగర ప్రజలందరూ తమ కుటుంబ సమేతంగా విచ్చేసి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ ప్రెసిడెంట్ బీసీ బాబు, వైస్ ప్రెసిడెంట్ శేఖరు, కోక్లస్టర్ హేమంత్ కుమార్, మహిళా శక్తి డివిజన్ ఇంచార్జ్ ఉమామహేశ్వరి, కల్పన,బూత్ కన్వీనర్లు ,బిఎల్సిలు తదితరులు పాల్గొన్నారు.




