Nellore: వైసీపీ ఆరోపణలకు మంత్రి నారాయణ కౌంటర్!

Nellore: నెల్లూరు అభివృద్ధి పనులపై వైసీపీ చేస్తున్న అవినీతి ఆరోపణలను మంత్రి నారాయణ తిప్పికొట్టారు.

V. Narasimhulu, Nellore
Published on: 26 April 2026 2:46 PM IST
Nellore
X

Nellore: వైసీపీ ఆరోపణలకు మంత్రి నారాయణ కౌంటర్!

Nellore: తనకు ఓటేసి అత్యధిక మెజారిటీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకొనేందుకు అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పారు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..

ఎండతీవ్రత నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఐదు మీటర్లకు ఒక చెట్టు వేయాలని సంకల్పించామని, గ్రీనరీతో 2 డిగ్రీల ఎండ తీవ్రతను తగ్గించవచ్చునని, తన అభ్యర్థన మేరకు చెట్లను దాతలు అందచేస్తున్నారని చెప్పారు. ట్రీగార్డులు కూడా దాతలే ఇస్తున్నారని, దేశవిదేశాల్లో స్థిరపడ్డ తన స్నేహితుల సహాయం కోరుతున్నానని, తన ఇంటికోసం కాదు సిటీ అభివృధ్ధికోసం అడుగుతున్నానని,చెట్లకోసం ఒక దాత రెండుకోట్లు ఇచ్చారని చెప్పారు .

ఒక్కపైసా కూడా కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయలేదని, ఎస్టిమేషన్ లు చూపించి, వైసీపీ నేతలు అవినీతి జరిగిపోయిందని అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకోకుండా అవినీతి జరిగిందని వైరల్ చేస్తున్నారని, మీకు ఏ వివరాలు కావాలన్నా కమిషనర్ ని అడిగి తెలుసుకోవచ్చునని చెప్పారు.

వీఆర్ హై స్కూల్ రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా నిలిచిందని, మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం అమలుచేస్తోందని చెప్పారు . ఉదయం టిఫిన్ ,సాయంత్రం స్నాక్స్ నారాయణ గ్రూప్స్ నుంచి ఉచితంగా ఇస్తున్నామని, 10 బస్సులకు అయ్యే ఖర్చును నారాయణ విద్యాసంస్థలే భరిస్తున్నాయని చెప్పారు.

సీఎస్సార్ నిధుల నుంచి, యూనియన్ బ్యాంకు నాలుగు బస్సులు ఇచ్చిందని, ఆ బస్సులకు కూడా నిర్వహణకు నెలకు 67 వేలు నారాయణ విద్యా సంస్థే భరిస్తోందని, మిగిలిన ఆరు బస్సులకు నెలకు లక్షపదిహేనువేలు నారాయణా విద్యా సంస్థే భరిస్తోందని చెప్పారు.

సీఎస్ఆర్ ఫండ్ తో పాటు ,ఆదాయంలో కొంత కేటాయించమని తన పిల్లలకు చెప్పానని, పేదరికం వల్ల నడిచి నేను స్కూల్ కి వెల్లేవాడినని,ఆ కష్టం పేదపిల్లలకు ఉండకూడదని భావించానని చెప్పారు. నెల్లూరు సిటీ ,రూరల్ ప్రబుత్వ పాఠశాల విద్యార్ధులకి సైకిళ్ళు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామని,

5 కోట్లతో 7900 సైకిళ్ళు పంపిణీకి సిద్ధం చేస్తున్నామని, సీఎస్సార్ ఫండ్స్ ద్వారా సీసీ కెమెరాలు ఇప్పించామని, ఇవేవీ నేను ఇప్పటివరకు చెప్పుకోకోలేదని అన్నారు . పదిహేను స్కూల్స్ అభివృద్ధికి దాతలు ముందుకొచ్చారని, దాన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారని, నేను తప్పు చేయను ,చేయాల్సిన అవసరం నాకు లేదని చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేసే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకన్నాలేదని అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టే చెబుతున్నానని, అవాకులు చవాకులు పేలినా నేను పట్టించుకోనని చెప్పారు .

అభివృద్దే తన జెండా , అజెండా అని అన్నారు. 850 కోట్లు కార్పొరేషన్ లో అభివృధికి నిధులు రాబట్టానని, రాజకీయాల్లో అంతర్గత ఆధిపత్య పోరు సహజమే అని, దాన్ని బూతద్దంలో చూడటం తగదని హితవు పలికారు. తన దగ్గర పనిచేసే వాళ్ళపై తప్పుడు కధనాలు సరికాదని, సోషల్ మీడియా వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేయటం భావ్యం కాదని అన్నారు. నిజాలు ఉంటే నిర్భయంగా రాయండి, తప్పులు ఉంటే సరిదిద్దుకొంటామని చెప్పారు మంత్రి నారాయణ.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story