Nellore: నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన - స్థానిక సమస్యలపై ఆరా

Nellore: నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించి సర్వేపల్లి కాలువ కట్ట వాసులకు శాశ్వత పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి, వైసీపీ తీరుపై మండిపడ్డారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 8 Aug 2026 12:12 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన - స్థానిక సమస్యలపై ఆరా

"ప్రజాసమస్యలపై దృష్టిపెట్టిన మంత్రి నారాయణ "

నెల్లూరు నగరం లోని, 15,8,10 డివిజన్ లలో అధికార యంత్రాంగంతో కలిసి పర్యటించారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ... స్థానికుల సమస్యలు తెలుసుకొంటూ... వినతులు స్వీకరిస్తూ ముందుకు సాగారు....మంత్రే తమవద్దకు వచ్చి సమస్యలు తెలుసుకోవటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు... ఏళ్లనాటి సమస్య పరిష్కరించేందుకు వచ్చిన మంత్రికి మహిళలు మంగళ హారతులిచ్చి స్వాగతం పలికారు.. ఆప్యాయంగా పలుకరిస్తూ,పిల్లలకు చాక్లెట్లు పంచుతూ,యోగక్షేమాలు తెలుసుకున్నారు మంత్రి.

అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ...

రాష్ట్రప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని,

అభివృద్ధి,సంక్షేమం పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, సీఎం చంద్రబాబు నాయుడి సుపరిపాలనను ప్రశంసిస్తున్నారని చెప్పారు.

అది చూసి వైసిపి భరించలేకపోతోందని,

భోగాపురం విమానాశ్రయం ప్రారంభాన్ని కూడా జీర్ణించుకోలేకున్నారని చెప్పారు... మెగా డిఎస్సీ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, 16 వేల మంది ఉపాధ్యాయుల సంతోషాన్ని హరించాలని చూస్తున్నారని, ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సైకోల్లా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

వాళ్ళ తీరు మారకపోతే 2029 లో వైసీపీ గ్రాఫ్ జీరో కి పడిపోతుందనీ హెచ్చరించారు.

సర్వేపల్లి కాలువ కట్ట వాసుల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. భగత్ సింగ్ కాలనీ తరహాలోనే శాశ్వత ఇంటిపట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

60 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వాళ్ళనెవరిని ఇబ్బంది పెట్టమని,

ఎన్జిటి నియమ నిబంధన ప్రకారం సర్వే చేయించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత,కమీషనర్ నందన్,ఎంఆర్ఓ వెంకటలక్ష్మి,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ,మాజీ జెడ్పిటిసి విజేతా రెడ్డి,కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి,

స్థానిక టీడీపీ నేతలు తిరుమల నాయుడు ,పెంచల్ చౌదరి,బీసీ బాబు,శేఖర్,హేమంత్,గయాజ్,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story