Nellore: నెల్లూరులో పండుగలా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న మంత్రి నారాయణ!

Nellore: నెల్లూరు 6వ డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 1 Sept 2026 11:24 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో పండుగలా పెన్షన్ల పంపిణీ పాల్గొన్న మంత్రి నారాయణ!

Nellore: నెల్లూరు నగర 6వ డివిజన్ ఉడ్ హౌస్ సంఘంలో పండుగలా పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంటింటికీ వెళ్లి మంత్రి నారాయణ పెన్షన్ లు పంపిణీ చేస్తూ లబ్ధి దారుల యోగక్షేమాలతో పాటు వారికి అందుతున్న సంక్షేమ పధకాలపై ఆరా తీశారు. మంత్రి స్వయంగా వచ్చి పెన్షన్ డబ్బులు ఇవ్వటంతో అవ్వ తాతలు ఆనందం వ్యక్తం చేశారు.

ఒకే ఇంటికి పెన్షన్,తల్లికి వందనం,ఉచిత గ్యాస్ తో పాటు నారాయణ సైకిల్స్ కూడా అందటంతో మంత్రికి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి ప్రదాతకు, మంగళ హారతులిచ్చి అభిమానం చాటుకున్నారు స్థానిక మహిళలు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి నెలా ఒక‌టో తేదీ రాగానే గుర్తొచ్చేది ఎన్టీఆర్ భ‌రోసా పెన్షన్ల కార్యక్రమం అని, 62 లక్షల కుటుంబాల్లో పెద్ద పండుగ అని, 2014-19 మ‌ధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం పెన్షన్లను 2000 రూపాయిల‌కు పెంచిందని చెప్పారు..

ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అస్తవ్యస్థ పాలనతో వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని తెలిపారు.పెన్షన్లను 2000 నుంచి 3000కు పెంచుతామ‌ని చెప్పి వాయిదా ప‌ద్దతిలో పెంచుకుంటూ వెళ్లిందని,

ఏడాదికి 250 రూపాయిల చొప్పున పెంచుతూ చివ‌రి ఏడాదికి 3000 చేసిందని చెప్పారు.2024 ఎన్నికల్లో పెన్షన్ మొత్తాన్ని

4 వేలు చేస్తామని చెప్పి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఇచ్చిన హామీని తూ.చ‌. త‌ప్పకుండా నెర‌వేర్చారని చెప్పారు. గత ప్రభుత్వంలా వాయిదాల పద్దతిలో కాకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మసహిళలు, బలహీన వర్గాల పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి 4 వేలకు పెంచి అందరి కళ్ళలో ఆనందం నింపారని చెప్పారు.

దివ్యాంగుల పెన్షన్లను రూ.6,000 కు, పూర్తి వికలాంగుల పెన్షన్లను రూ.15,000కు, కిడ్నీ, కాలేయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్లను రూ.10,000 కు పెంచి అమ‌లు చేస్తున్నారని చెప్పారు. ఒకటో తేదీ సెలవు వస్తే ముందురోజే పెన్షన్ ఇస్తున్నామని,

క్రమం తప్పకుండా ప్రతీ నెలా ఒకటో తారీఖున ఇంటివద్దకే పింఛన్ డబ్బులు చేరుస్తుండటంతో అవ్వతాతల కళ్ళలో కనిపిస్తున్న ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉందని చెప్పారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల కోసం రూ.73,594.44 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతోన్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పారు... తెలంగాణలో 2016 రూపాయలే ఇస్తున్నారని,

తమిళనాడులో 1000 రూపాయలే ఇస్తున్నారని, కర్ణాటకలో 600 రూపాయలే ఇస్తున్నారని, మన రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా పేద‌ల కోసం బాధ్యత‌గా ఆలోచిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు.

2019 లో కేంద్రం మంజూరు చేసిన వేల కోట్ల రూపాయల నిధులను గత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటంతో అ నిధులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయని చెప్పారు. సీఎం అపార అనుభవంతో పరిస్థితులు గాడిలో పడుతున్నాయని, ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించామని, పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు సీఎం చంద్రబాబు,డీసీఎం పవన్ కల్యాణ్,యువనేత లోకేష్ కృషి చేస్తున్నారని, పెట్టుబడులు రాబట్టడంలో విజయం సాధించారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్ ,మేయర్ దేవరకొండ సుజాతా,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ,మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి,కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి,,డివిజన్ నాయకులు కొండా ప్రవీణ్,రాజ్యలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story