Nellore: కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది.. ఇంటి ముంగిటికే పెన్షన్ల వెనుక అసలు కథ!
Nellore: నెల్లూరులో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి నారాయణ. ఇతర రాష్ట్రాల పెన్షన్లతో ఏపీ పెన్షన్లను పోల్చుతూ కీలక వ్యాఖ్యలు.
Nellore: కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది.. ఇంటి ముంగిటికే పెన్షన్ల వెనుక అసలు కథ!
Nellore: నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ మన్సూర్ నగర్ లో శుక్రవారం పలువురికి పింఛను పంపిణీ చేసిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ..
తొలిరోజే 99 శాతం పెన్షన్ లను ప్రతినెలా లబ్ధిదారుల ఇంటి ముంగిటికే చేస్తున్నామని , పెన్షన్ లు అందుకొన్న అవ్వా తాతలు ,అక్క చెల్లెమ్మలు ,దివ్యాంగుల కళ్ళలో ఆనందం వెల్లివిరుస్తోంది అన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పెన్షన్ మొత్తాన్ని 4 వేలు చేస్తానని , మూడునెలల బ్యాలెన్స్ కూడా కలిపి ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చారని, ఇచ్చిన మాటప్రకారం వికలాంగుల పెన్షన్లను రూ.6,000కు, పూర్తి వికలాంగుల పెన్షన్లను రూ.15,000 కు ,కిడ్నీ, కాలేయ, గుండె మార్పిడి, బోదకాలు,మూత్రపిండ వంటి దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్లను రూ.10,000కు పెంచి, జూలై 1 2024 నుండి అమలు చేస్తున్నామని తెలిపారు.
మనపొరుగు రాష్ట్రాలు తెలంగాణాలో 2016 రూపాయలు , తమిళనాడులో 1000 రూపాయలు ,కర్ణాటకలో 600 రూపాయలు మాత్రమే సామాజిక పెన్షన్ కింద అందిస్తున్నారని , వెస్ట్ బెంగాల్ ,మహారాష్ట్ర , జార్ఖండ్ ,రాజస్థాన్ ,ఉత్తరప్రదేశ్ , గుజరాత్ రాష్ట్రాల్లో సైతం పెన్షన్ కింద వెయ్యిరూపాయాలే చెల్లిస్తున్నారని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ,పుదుచ్చేరి ,అండమాన్ నికోబార్ ,అరుణాచల్ ప్రదేశ్ ,చండీఘర్ లక్షద్వీప్ ,జమ్మూ & కాశ్మీర్ ,డయ్యు & డామన్ లలో సైతం వెయ్యి నుంచి రెండువేల ఐదువందల లోపే పెన్షన్ లకు ఇస్తున్నారన్నారు. నాగాలాండ్ ,మణిపూర్ ,అస్సాం ,మిజోరాం ,ఛత్తీస్ ఘడ్ ,బీహార్ రాష్ట్రాల్లో 500 రూపాయల లోపే పెన్షన్ అందిస్తున్నారు.
బాలారిష్టాలను అధికమిస్తూ ఇచ్చిన మాటప్రకారం పెంచిన పెన్షన్ లను క్రమం తప్పకుండా పంపిణీ జరుగుతోందన్నారు. రాష్ట్రం పై మోపి వెళ్లిన పదిలక్షల కోట్ల భారం మోస్తూ, సీఎం అపార అనుభవంతో మాట నిలబెట్టుకొన్నారని చెప్పారు. పరిశ్రమలు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమౌతుందని, సీఎం చంద్రబాబు ,మంత్రి లోకేష్ పెట్టుబడులు రాబట్టేందుకు విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా 25 శాతం పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగబోతున్నాయన్నారు.
రానున్న రెండు సంవత్సరాలు కాలవ్యవధిలో ప్రతీ వీధిలో చెట్లు నాటి నెల్లూరుని గ్రీన్ సిటీ గా మార్చి నగర వాతావరణం పచ్చదనం పెంపొందించడం ద్వారా రెండు డిగ్రీలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ,మెప్మా పీడీ కిరణ్ కుమార్,నందన్,మేయర్ సుజాతా అశోక్,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వివిధ శాఖల అధికారులు , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.




