Nellore: ఈ నెల 16న మంత్రి నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటన

Nellore: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సెప్టెంబరు 16న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పాఠశాలల ప్రారంభోత్సవాలతో పాటు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 15 Sept 2026 4:47 PM IST
Nellore
X

Nellore: ఈ నెల 16న మంత్రి నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటన

నెల్లూరు జిల్లా: రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 16వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబరు 16వ తేదీ ఉదయం 7.30 గంటలకు తిరుమల నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు నెల్లూరు నగరంలోని లక్ష్మీసాయి నగర్, స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్‌ఎస్‌ఆర్ హైస్కూల్‌కు చేరుకుంటారు. అక్కడ పునరుద్ధరించిన ఆర్‌ఎస్‌ఆర్ హైస్కూల్‌ను ప్రారంభిస్తారు.

అనంతరం ఉదయం 10.45 గంటలకు బయలుదేరి 11 గంటలకు ములాపేట, శాంతినగర్‌లోని డీఎస్‌ఆర్ స్కూల్‌కు చేరుకుని పునరుద్ధరించిన పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం ఉదయం 11.45 గంటలకు నెల్లూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు కోవూరు మండలం చిన్నపడుగుపాడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఏర్పాటు చేసే స్వాగత కార్యక్రమంలో పాల్గొని, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

మధ్యాహ్నం 1.15 గంటలకు చిన్నపడుగుపాడు నుంచి బయలుదేరి 1.25 గంటలకు కోవూరులోని ఉషోదయ డెయిలీ పార్లర్‌కు చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశంలో పాల్గొంటారు.

అనంతరం సాయంత్రం 5 గంటలకు కోవూరు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని తన నివాసానికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆ ప్రకటనలో తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE