Nellore: స్వర్ణభారత్ ట్రస్టులో మాజీ ఉపరాష్ట్రపతితో మంత్రి ఆనం భేటీ

Nellore: వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

A Praveen, Nellore
Published on: 6 Sept 2026 2:56 PM IST
Nellore
X

Nellore: స్వర్ణభారత్ ట్రస్టులో మాజీ ఉపరాష్ట్రపతితో మంత్రి ఆనం భేటీ

Nellore: భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆదివారం మర్యాదపూర్వకంగా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులోని వెంకయ్య నాయుడు గారి నివాసంలో భేటీ అయ్యారు

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారితో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. రాజకీయ, సామాజిక అంశాలతో పాటు పలు వ్యక్తిగత, ఆత్మీయ విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు.

స్వర్ణభారత్ ట్రస్టులో రేపు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని పలువురు కీలక నేతలు జాతీయ ప్రముఖులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు హాజరు కానున్నారు..

కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు , విజయవాడలో పార్టీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలు, బాధ్యతల్లో పాల్గొనాల్సి ఉండటంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ముందుగానే వెంకయ్య నాయుడు గారిని వ్యక్తిగతంగా కలిసి తన గౌరవాభిమానాలను అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి భేటీ అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగింది.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story