Nellore: వైఎస్సార్‌సీపీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డి 71వ జన్మదిన వేడుకలు
Nellore: కొండాపురం మండలం తూర్పుయర్రబల్లిలో ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి 71వ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు.
Nellore: వైఎస్సార్‌సీపీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డి 71వ జన్మదిన వేడుకలు
నెల్లూరు: నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పుయర్రబల్లి గ్రామంలో ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి 71వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేకపాటి అభినవ్ రెడ్డి ఆర్మీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమందికి ప్రాణదానం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




