Marripadu: శేషం సుదర్శన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రముఖులు

Marripadu: రాంపల్లిలో శేషం పద్మమ్మ గారి ఉత్తరక్రియలు. విజిలెన్స్ కమిటీ సభ్యులు సుదర్శన్‌ను పరామర్శించిన ఆత్మకూరు సీఐ, ఎమ్మార్వో, ఎస్సై మరియు ప్రజాప్రతినిధులు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 1 Aug 2026 5:24 AM IST
Marripadu
X

Marripadu: శేషం సుదర్శన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రముఖులు

మర్రిపాడు: జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శేషం సుదర్శన్ నానమ్మ శేషం పద్మమ్మ ఇటీవల స్వర్గస్తులైనారు.ఈ సందర్భంగా శేషం పద్మమ్మ గారి ఉత్తర క్రియలు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాంపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు సిఐ గంగాధర్, మర్రిపాడు ఎస్సై బలరాం రెడ్డి,మర్రిపాడు ఎమ్మార్వో అనిల్ కుమార్ యాదవ్, మర్రిపాడు మండల మాజీ ఎంపీపీ కోనంకి శ్రీనివాసులు నాయుడు ఆత్మకూరు అభిరామ్ హాస్పిటల్ అధినేత డా.కేవి శ్రావణ్ కుమార్ తదితరులు సుదర్శన్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు,బంధువులు, మిత్రులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story