Nellore: మర్రిపాడు సెంటర్‌లో 'నీడ' కరువు.. ప్రయాణికుల పాలిట నరకప్రాయం!

Nellore: నెల్లూరు-ముంబై జాతీయ రహదారిలోని మర్రిపాడు సెంటర్‌లో బస్ షెల్టర్, మరుగుదొడ్లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం.

M Satya Peter, Atmakur
Published on: 13 April 2026 11:28 AM IST
Nellore
X

Nellore: మర్రిపాడు సెంటర్‌లో 'నీడ' కరువు.. ప్రయాణికుల పాలిట నరకప్రాయం!

ఆత్మకూరు: జిల్లా సరిహద్దు ప్రాంతంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ప్రధానమైనది మర్రిపాడు సెంటర్. అటు కడపకు ఇటు నెల్లూరుకు మర్రిపాడు కీలకమైనది. అలాంటి తరుణం లో ప్రయాణికులకు బస్సు షెల్టర్ కరువు అవడంతో ఎండలోనూ, వానలోనూ నిల్చుని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతోపాటుగా మహిళలకు మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడకతప్పడం లేదు. అంతేకాకుండా త్రాగునీటికి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు అధికారులు ఇటు పాలకులు కనీసం మర్రిపాడు సెంటర్లో బస్సు షెరల్టర్ ను నిర్మించకపోవడం దారుణమని మండల ప్రజలు పెదవి విరుస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..

నెల్లూరు జిల్లాలో చిట్టచివరి మండలం మర్రిపాడుమండలం ఈ మండలం పొడవునా నెల్లూరు- ముంబై జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అంతేకాకుండా మండలంలోని ప్రజలు అటు కడపకు గాని ఇటు నెల్లూరుకు గాని ప్రయాణం సాగిస్తుంటారు. అలాంటి తరుణంలో మర్రిపాడు ప్రజలకు బస్సుల కోసం వేసి చూసే సందర్భంలో బస్సు సెంటర్ లేకపోవడంతో ఎండలోనే పడిగాపులు కాస్తూ బస్సుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈనేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలోను వానలోనూ నిలుచుకుని పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే మహిళలకు మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.

దీంతో పాటుగా త్రాగునీరు కూడా కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మర్రిపాడు మండలం ప్రజలే కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులతో పాటుగా కార్లలో ప్రయాణించే వాళ్ళు, ఆటోలో, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా కాసేపు సెంటర్లో సేదదీరేందుకు మరియు టిఫిన్ భోజనాలు చేసేందుకు అగుతుంటారు. ఈ నేపథ్యంలో నిలుచు కొనేందుకు నీడ కూడా కరువు అవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే దుకాణాల్లోకి వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా విపరీతమైన ఎండకు రహదారిలోనే నిలుచొని ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్య సంవత్సరాల తరబడి నుండి ఉన్నప్పటికీ అటు పాలకులు గానీ ఇటు ప్రభుత్వా అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా మర్రిపాడు.సెంటర్లో బస్ షెల్టర్ తో పాటు మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణాలను ఏర్పాటు చేయాల్సిందిగా పలువురు కోరుతున్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story