Nellore: ఆగస్టు 31న రాష్ట్రవ్యాప్తంగా 'సంచార జాతుల విముక్త దివస్'!

Nellore: ఆగస్టు 31న నిర్వహించే సంచార జాతుల విముక్త దివస్ వేడుకలను విజయవంతం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా నేత ముక్కు రాధాకృష్ణ గౌడ్ పిలుపునిచ్చారు.

A Praveen, Nellore
Published on: 28 Aug 2026 1:23 PM IST
Nellore
X

Nellore: ఆగస్టు 31న రాష్ట్రవ్యాప్తంగా 'సంచార జాతుల విముక్త దివస్'!

Nellore: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో స్ఫూర్తి చాలా ముఖ్యమైనదని ఆగస్టు 31వ తేదీన సంచారజాతుల విముక్తా దివస్ ను పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, రాష్ట్రంలో నాలుగు జోన్లలో నాలుగు ముఖ్య ప్రదేశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా రాయలసీమ జోన్ ఆగస్టు 30వ తారీఖున,

అనంతపురం నగరంలో కోస్తాంధ్ర జోన్ తిరుపతి నగరంలో ఆగస్టు 31వ తేదీన, ఉత్తరాంధ్ర జోన్ అనకాపల్లిలో గోదావరి జోన్ రాజమండ్రి నగరంలో విజయవాడ నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంచార జాతుల విముక్తా దివస్ సందర్భంగా ర్యాలీలు సభలను నిర్వహిస్తున్నట్లు, పై కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్. మాధవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగాల. గోపి శ్రీనివాసుల ఆదేశాలతో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు పై కార్యక్రమాలు విజయవంతానికి రూపకల్పన చేసినట్లు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ తెలిపారు.

అలాగే సంచార జాతులు సదాచార వారసులు మన సమాజానికి స్ఫూర్తి ప్రదాతలు అనే నినాదంతో సంచార సమాజానికి అండగా ఉంటూ వారిని అక్కున చేర్చుకోవడం మన బాధ్యతగా భావిస్తూ విముక్త జాతుల చరిత్ర అందరికీ తెలిసే విధంగా చేస్తామని డిఎన్టి కమిషన్ ఏర్పాటు ,ఎన్ టి ,డి ఎన్ టి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్రంలో ఉన్న 38 ఎన్ .టి. డి. ఎన్. టి తెగలకు గుర్తింపు సర్టిఫికెట్ల జారీ విషయమై తాము పని చేస్తామన్నారు.

వారి వారి కళలను కనుల పండుగగా ప్రదర్శించుకునే విధంగా సంస్కృతి, సాంప్రదాయాలు అలాగే ఆనాడు విదేశీ దాడులను ఎదుర్కోవడంలో భారతీయ రాజ్యాల భద్రతకు విదేశీయులను నిరోధించడానికి వారు ఎంతగానో కృషి చేశారన్నారు .

అలాగే వారి కట్టుబాట్లు ఆచార, వ్యవహారాలు ఎంతో మంచి వని, సమాజానికి, ప్రకృతికి మేలుకొలిపేవని దాసరి, బుడగజంగాలు, కాటిపాపర్లు సర్కస్ వాళ్ళు ఇలా రాష్ట్రంలో 38 తెగలు ఉండగా దేశవ్యాప్తంగా 1400 పైగా జాతులు ఉన్నాయని ఇవన్నీ ఎన్డీఏ పాలిత భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్నో వందల సంవత్సరాలుగా ప్రకృతితో పెనవేసుకుపోయిన వారి జీవన విధానాన్ని గుర్తించి వారికి సరైన గుర్తింపుని,

ప్రాధాన్యతను ఇస్తూ సదాచారం- సంస్కృతికి వారసులుగా కుటుంబ విలువలు ,ధర్మాలు ,ప్రకృతి పై పట్టును కలిగి ఉండడాన్ని అభినందిస్తూ వారిని మిగతా సమాజంతో కలుపుకుంటూ వారిని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవాలనే ధ్యేయంతో పై కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లాలోని అనేక ఎన్ టి డి ఎన్ టి కాలనీలను సందర్శించి ఆయా కులాల కుల సంఘ నాయకులు ప్రజలతో ముచ్చటించి అందరినీ తిరుపతిలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగినది

కావున పై వర్గాల ప్రజలందరూ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండి. రఘురామయ్య, తిరుపతి జిల్లా ఇంచార్జ్ గంజాం. పెంచల ప్రసాద్ మరియు సంచార అర్ధ సంచార జాతుల కుల సంఘాల నాయకులు ప్రజలు పాల్గొనడం జరిగినది తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story