Nellore: రాపూరు–చిట్వేలు ఘాట్ రోడ్డులో చిరుత కలకలం పిట్టగోడపై ప్రత్యక్షం!
Nellore: రాపూరు–చిట్వేలు ఘాట్ రోడ్డులో చిరుత సంచారంతో భయాందోళనలో ప్రయాణికులు. పిట్టగోడపై ఉన్న చిరుత వీడియో వైరల్. రక్షణ కల్పించాలని అటవీశాఖను కోరిన స్థానికులు.
Nellore: రాపూరు–చిట్వేలు ఘాట్ రోడ్డులో చిరుత కలకలం పిట్టగోడపై ప్రత్యక్షం!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు - చిట్వేలు ఘాట్ రోడ్డులో చిరుతల సంచారంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వారికి పిట్ట గోడపై చిరుత కనిపించింది.
చిరుతను సెల్‌ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అటవీ అధికారులు చిరుత సంచారాలను అరికట్టి.. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు గ్రామస్తులు.
Next Story




