Rapur: రాపూరు ఘాట్‌లో చిరుత సంచారం ప్రయాణికుల ఆందోళన!
Rapur: నెల్లూరు జిల్లా రాపూరు ఘాట్ రోడ్డులో చిరుత సంచారంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో రాకపోకలకు జంకుతున్నారు.
Rapur: రాపూరు ఘాట్‌లో చిరుత సంచారం ప్రయాణికుల ఆందోళన!
Rapur: నెల్లూరు జిల్లా రాపూరు–చిట్వేలు ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో తరచూ చిరుతలు రహదారిపైకి రావడంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
తాజాగా రాత్రి సమయంలో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న కొందరికి పిట్టగోడపై కూర్చున్న చిరుత కనిపించింది. దీంతో వారు చిరుతను తమ సెల్‌ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఘాట్ రోడ్డులో చిరుతల సంచారంపై చర్చ జరుగుతోంది.
గత కొంతకాలంగా ఈ మార్గంలో చిరుతలు రోడ్డుకు అడ్డంగా రావడంతోపాటు, రహదారి పక్కన ఉన్న పిట్టగోడలపై కనిపిస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో ఈ మార్గంలో ప్రయాణించేందుకు వాహనదారులు భయపడుతున్నారు.
దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చిరుతలు ఎప్పుడు రోడ్డుపైకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఏదైనా ప్రమాదం జరగకముందే అటవీశాఖ అధికారులు స్పందించి, చిరుతల సంచారాన్ని పర్యవేక్షించడంతోపాటు ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.




