Nellore: లీలా మహల్ పునఃప్రారంభం.. మాగుంట ఆదిత్య రెడ్డి

Nellore: నెల్లూరు సిటీలోని చారిత్రక లీలా మహల్ థియేటర్ మే 14 నుంచి పునఃప్రారంభం కానుంది.

V. Narasimhulu, Nellore
Published on: 12 May 2026 2:36 PM IST
Nellore
X

Nellore: లీలా మహల్ పునఃప్రారంభం.. మాగుంట ఆదిత్య రెడ్డి

Nellore: నెల్లూరు సిటీ లీలామహల్ సెంటర్ అంటే తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సెంటర్ కి ఆ పేరు రావడానికి కారణం లీలా మహల్ థియేటర్. వి ఆర్ సి కూడలిలో గల ఈ థియేటర్ నెల్లూరు పట్టణంలో గతంలో వెలుగు వెలిగింది. కాలక్రమేణా ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా సినిమా థియేటర్స్ లో వచ్చిన టెక్నాలజీ మార్పులతో ఈ లీలామహల్ పాతబడిపోయింది. మల్టీప్లెక్స్ హవా ఓ వైపు. ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ మరోవైపు మొదలైనప్పటి నుంచి, మామూలు సినిమా థియేటర్స్ చాలా మట్టుకు కళ్యాణ మండపాలుగా మారిపోయాయి.

గత 75 సంవత్సరాల క్రితం ప్రారంభమైన లీలామహల్ తన పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవడానికి, సరికొత్త హంగులతో మళ్లీ నగరవాసులను కనువిందు చేయడానికి సిద్ధమైంది. లీలా మహల్ నిర్వాహకులు మాగుంట ఆదిత్య రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

ఈనెల 14 నుంచి లీలామహల్ ను పునర్ ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు మాగుంట ఆదిత్య రెడ్డి ప్రకటించారు. గత 75 సంవత్సరాల నుంచి ప్రేక్షకులకు లీలామహల్ చక్కటి వినోదాన్ని అందిస్తోందన్నారు. ఈనెల 14న సూర్య సినిమాతో సినిమా షోలు ప్రారంభమవుతాయన్నారు. టిక్కెట్ ధరను 250 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించామన్నారు. మొత్తం ఐదు షోలకు తమకు అనుమతి ఉన్నట్లు తెలిపారు మాగుంట ఆదిత్య రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story