Nellore: స్వర్గీయ గంగపట్నం చంద్రశేఖరయ్య సేవలు అమూల్యం డాక్టర్ రవికుమార్
Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం జంగాల కండ్రికలో స్వర్గీయ గంగపట్నం చంద్రశేఖరయ్య జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
Nellore: స్వర్గీయ గంగపట్నం చంద్రశేఖరయ్య సేవలు అమూల్యం డాక్టర్ రవికుమార్
నెల్లూరు: రాజకీయ నాయకుడిగా,ప్రజాప్రతినిధిగా వివిధ పదవులు చేపట్టి పేద ప్రజలకు విశేష సేవలందించిన స్వర్గీయ గంగపట్నం చంద్రశేఖరయ్య సేవలు అమూల్యమని రిచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, ప్రముఖ చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ తెనాలి రవికుమార్ కొనియాడారు.
నెల్లూరు జిల్లా సంగం మండలం జంగాల కండ్రిక గ్రామంలో ఆదివారం స్వర్గీయ గంగపట్నం చంద్రశేఖరయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, మాజీ సర్పంచ్ గంగపట్నం సునీల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ తెనాలి రవికుమార్ మాట్లాడుతూ చంద్రశేఖరయ్య ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన సేవలకు గుర్తుగా సంగం మండలంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.రిచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు కె. విజయలక్ష్మి, మాదాల సాయి మేఘనతో పాటు వైద్య సిబ్బంది గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించి వైద్య సలహాలు అందించారు.
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ తెనాలి రవికుమార్‌ను నెల్లూరు 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్, ఉద్యోగ సంఘ నాయకులు ఉద్దండి అమరలింగం, కల్పం రమేష్ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జంగమ సేవా సంఘం నాయకులు గంధవళ్ళ దశరధరామయ్య, ముత్యాల పిచ్చయ్య, పుల్లూరు వెంకటకృష్ణ, మండల ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




