Nellore: కోవూరులో వైఎస్ఆర్సీపీ సెగ టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై నేతల ధ్వజం!

Nellore: టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును పదవి నుండి తొలగించాలని కోవూరు వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 12:31 PM IST
Nellore
X

Nellore: కోవూరులో వైఎస్ఆర్సీపీ సెగ టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై నేతల ధ్వజం!

Nellore: కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నాయకుల టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు పై తీవ్ర విమర్శలు గుప్పించారు.బి ఆర్ నాయుడు ని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైఎస్ఆర్సిపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావు మాట్లాడుతూ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీల వీడియోలు బయటకు రావడంతో కోట్లాదిమంది భక్తులు ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తిరుమల పవిత్రతకు భంగం వాటిలో విధంగా ప్రవర్తించిన బిఆర్ నాయుడు ను వెంటనే పదవి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి టీటీడీ భక్తుల మనోభావాలను కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బి.ఆర్. నాయుడు తొలగింపునకు దేవుడి ఆశీస్సులు కలగాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, మండల కన్వీనర్లు, మహిళలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story