Indukurpet: హైటెన్షన్.. వైసీపీ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు.. తోపులాట!
Indukurpet: నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో తీవ్ర ఉద్రిక్తత.
Indukurpet: హైటెన్షన్.. వైసీపీ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు.. తోపులాట!
ఇందుకూరుపేట: ఇందుకూరుపేటలో హై టెన్షన్ వాతావరణ నెలకొంది.డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు దీంతో కాసేపు వైసిపి నాయకులు,పోలీసులు మధ్యలో తోపులాట జరిగింది దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పోలీసులు ఏర్పాటుచేసిన బ్యారికెట్లను తోసేసి ర్యాలీని కొనసాగించిన వైసిపి నాయకులు.ర్యాలీకి సంఘీభావం తెలిపిన వైసిపి రాష్ట్ర కార్యదర్శి పేర్నిటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి
ర్యాలీకి భారీగా తరలివచ్చిన కోవూరు నియోజవర్గంలోని వైసీపీ శ్రేణులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పేర్నిటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.జెంజి పోరాటం చేసి కేంద్ర విద్యా శాఖ మంత్రిని రాజీనామా చేయించారు స్పోర్ట్స్ కోట కింద చేర్చకూడనటువంటి క్రీడలను డీఎస్సీ నియామకాల్లో చేర్చి
డీఎస్సీ పై వైసీపీ పోరాటం చేస్తుంటే అధికారి పార్టీ నుంచి స్పష్టమైన సమాచారం రావడం లేదు ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి త్వరలోనే ముఖ్యమంత్రి కావడానికి తహతహలాడుతున్నారు డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష కైనా సిద్ధం అంటూ పెర్నాటి అన్నారు.విద్యాశాఖ మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి పదవి కి ప్రమోషన్ ఇస్తారేమో అందుకోసమైనా లోకేష్ రాజీనామా చేయాలి. విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా వైసిపి నాయకులు,యువత పోరాటాలు చేస్తుంటే లోకేష్ కు మీడియా సమావేశం పెట్టి సమాధానం చెప్పే ధైర్యం లేకుండా పోయింది.పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేయాల్సిన అవసరం లేదు పేకాటనే స్పోర్ట్స్ కోటాలో చేర్చారు అంటూ అయన మండిపడ్డారు.వైసిపి చేస్తున్న పోరాటాన్ని పోలీసులు అడ్డుకోవడం సరికాదు డీఎస్సీ లో అవకతవకలు జరగకపోతే సిబిఐ విచారణ కు ఆదేశించండి అన్నారు.




