Kovur: కోవూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
Kovur: కోవూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు డిమాండ్ చేస్తూ ఈ నెల 6-9 వరకు రిలే దీక్షలు, 10న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ తెలిపింది.
Kovur: కోవూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
నెల్లూరు జిల్లా: కోవూరు మండలంలోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ, మండల నాయకుల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరీ చలపతిరావు, నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్‌బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, కోవూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నాయకత్వంలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, విడవలూరు, కొడవలూరు మండలాల్లో రిలే నిరాహార దీక్షలు*నిర్వహిస్తామని తెలిపారు.10వ తేదీన ఇందుకూరుపేట మండలంలో సురేష్‌రెడ్డి ఇంటి నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపడతామని వెల్లడించారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనినిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలనిప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.




