Kodavalur: కొత్తవంగల్లులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే

Kodavalur: కొడవలూరు మండలం కొత్తవంగల్లులో రెండేళ్ల అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. భూ సమస్య పరిష్కారానికి హామీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Aug 2026 7:07 PM IST
Kodavalur
X

Kodavalur: కొత్తవంగల్లులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే

కొడవలూరు: కొడవలూరు మండలం కొత్తవంగల్లులో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం'* కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే కారణంగా ప్రభుత్వ భూముల జాబితాలో చేరిన సుమారు 400 ఎకరాల భూమి సమస్యను గ్రామసభ నిర్వహించి పరిష్కరిస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.గత రెండేళ్లలో కొత్తవంగల్లు పంచాయతీలో రూ.4.24 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పనులు చేపట్టినట్లు తెలిపారు.

ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, నుడా, టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా రోడ్లు, కాలువలు, విద్యుత్ లైన్లు, సీసీ డ్రెయిన్లు, సోలార్ కనెక్షన్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు వివరించారు.గ్రామ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా డీఎంఎఫ్, జలజీవన్ మిషన్, ఎస్‌డీఎస్ గ్రాంట్ల ద్వారా మొత్తం రూ.1.34 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులతో రూ.10 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.సూపర్ సిక్స్ హామీల అమలు, పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు చక్క మధన్ మోహన్,వేముల వెంకటేశ్వర్లు,చక్క రఘురామయ్య,చక్క సూలంబాబు,పగడాల మురళి,నంబూరి శ్రీనివాసులు,ఉక్కాల దామోదర్,ఉక్కాల రమేష్,జ్యోతి సుమన్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story