Buchireddypalem: మువ్వన్నెల మయమైన బుచ్చిరెడ్డిపాళెం యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే!

Buchireddypalem: హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా జరిగింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Aug 2026 8:48 PM IST
Buchireddypalem
X

Buchireddypalem: మువ్వన్నెల మయమైన బుచ్చిరెడ్డిపాళెం యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే!

బుచ్చిరెడ్డిపాళెం: హర్‌ ఘర్‌ తిరంగా వారోత్సవాల్లో భాగంగా బుచ్చిరెడ్డిపాళెంలో చేపట్టిన తిరంగా యాత్రలో కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

భావి భారత పౌరులు, దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. విద్యార్థులు దేశభక్తిని మనసులో ఉంచుకుని, మంచి లక్ష్యాన్ని ముందుంచుకుని కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

తల్లిదండ్రులను, దేశాన్ని మరచిపోని వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తిని తీసుకుని, విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story