Kovur: అధికార పార్టీ తొత్తులను ట్రంకు రోడ్డులో నిలబెడతాం: నల్లపురెడ్డి!

Kovur: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు.

K.Sriharibabu, Kovur (Nellore Dsct)
Published on: 27 Aug 2026 5:57 PM IST
Kovur
X

Kovur: అధికార పార్టీ తొత్తులను ట్రంకు రోడ్డులో నిలబెడతాం: నల్లపురెడ్డి!

కోవూరు: జరగబోవు స్థానిక ఎన్నికలలో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తే పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని నెల్లూరు ట్రంకు రోడ్లో నిలబెడతానని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు.

గురువారం కోవూరు వైసీపీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిచోట్ల వైసిపి పోటీ చేస్తుందన్నారు కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు వ్యతిరేకత ఉందన్నారు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి బ్యాలెట్ లతో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

పోలీసులు అంటే గౌరవం ఉందని తమకు గౌరవం ఉందని కానీ మండల స్థాయిలో కొంతమంది సిఐలు ఎస్ఐలు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తీరు మార్చుకోకుంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సప్త సముద్రాలు అవతల ఉన్న పట్టుకొస్తామన్నారు. పోలీసులకు అభిమానం ఉంటే కాకి బట్టల విప్పేసి పసుపు బట్టలు వేసుకోవాలని సూచించారు.

K.Sriharibabu, Kovur (Nellore Dsct)

K.Sriharibabu, Kovur (Nellore Dsct)

Next Story