Nellore: పొట్టేపాలెం బ్రిడ్జి పనులను పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Nellore: నెల్లూరు రూరల్ పొట్టేపాలెం బ్రిడ్జి పనులను పరిశీలించిన టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. సెప్టెంబర్ 20 నుంచి 25 లోపు ప్రారంభమని వెల్లడి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 7 Sept 2026 7:52 PM IST
Nellore
X

Nellore: పొట్టేపాలెం బ్రిడ్జి పనులను పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Nellore: నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో నిర్మిస్తున్న పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులను ఆర్ & బి అధికారులతో కలసి పరిశీలించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ...

కూటమి ప్రభుత్వం ఏర్పడినతరువాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖామంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ల సహాయ సహకారాలతో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులను మంజూరు అయ్యాయని, ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ప్రజలకు మేలుచేసేలా ఉండాలని పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని , పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయని, సెప్టెంబర్ నెల 20వ తేదీ నుండి 25 తేదీలోగా పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ని ప్రారంభిస్తామని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధిపధంలో నిలుపుతున్నారని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, టీడీపీ నాయకులు కందల హరి, సురేష్, శ్రీనాథ్, సీనయ్య, జోగి బాబు తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story