Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో యుద్ధప్రాతిపదికన కుర్చీల మరమ్మత్తులు!
Nellore: నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలతో కుర్చీలు, వీల్ చైర్ల మరమ్మత్తులు వేగవంతం. రోగులకు మెరుగైన వసతులు.
Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో యుద్ధప్రాతిపదికన కుర్చీల మరమ్మత్తులు!
Nellore: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశాలు ఇవ్వడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ లో త్రీ చైర్స్, వీల్ చైర్స్, స్ట్రక్చర్స్, ఇతర కుర్చీలను మరమ్మత్తులు చేయించే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.
శుక్రవారం హాస్పిటల్ సూపర్డెంట్ మాధవి, ఆర్ ఎం ఓ శ్రీనివాసులు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు దగ్గరుండి కుర్చీల మరమ్మత్తులను పరివేక్షించారు.
నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూర్చునేందుకు వీలుగా మరమ్మతులకు గురైన కుర్చీలను దగ్గరుండి బాగు చేయించారు. మరమ్మతులు పూర్తయిన కుర్చీలను పలు విభాగాలకు తీసుకువెళ్లి అక్కడ రోగులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు.




