Nellore: రాజకీయాల్లోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి కుమార్తె 'సాయి వైష్ణవి'!
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
Nellore: రాజకీయాల్లోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి కుమార్తె 'సాయి వైష్ణవి'!
Nellore: రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ పెట్టుబడులు తీసుకువస్తున్నారని చెప్పారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి. నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి విలేకరుల సమావేశం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి యువనేత నారా లోకేష్ కృషి తో భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాష్టానికి పెట్టుబడులు తీసుకువస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.
ఇప్పటి వరకు నెల్లూరు రూరల్ లో 658 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయని, త్వరలోనే 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేరుకుంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి నెల్లూరు రూరల్ ఒక కంచుకోట అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 కి 100 శాతం గెలిచేందుకు మనమందరం కష్టించి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 కి 100 శాతం గెలిచి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ కి బహుమతిగా ఇద్దాం అని అన్నారు కోటంరెడ్డి సాయి వైష్ణవి.




