Nellore: త్వరలో నెల్లూరు పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవం

Nellore: నెల్లూరు రూరల్ లోని పండ్ల మార్కెట్ అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు.

V. Narasimhulu, Nellore
Published on: 25 April 2026 5:11 PM IST
Nellore
X

Nellore: త్వరలో నెల్లూరు పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవం

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పండ్ల మార్కెట్ లో రూ. 1 కోటి 53 లక్షలతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను నెల్లూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డితో మరియు మార్కెట్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ..

పండ్ల మార్కెట్ లో మరో 10 రోజుల్లో పనులన్నీ పూర్తి కానున్నాయని, అతి త్వరలో అభివృద్ధి పనులను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు.

పండ్ల మార్కెట్ నందు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని, పండ్ల వ్యాపారస్తులకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి చేస్తారని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ, ఏఎంసీ వైస్ చైర్మన్ రాపూరు శేఖర్, 38వ డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత, ఏఎంసీ మార్కెట్ కమిటీ సభ్యులు ముక్కం సాయి లక్ష్మణ్, కుంచనపల్లి శివకుమార్, భీమతాటి సుధాకర్, గునుకుల విజయలక్ష్మి, తుళ్లూరు బాబు,

కుప్పా ప్రసన్న, దాసరి లక్ష్మీ, కుల్లూరు శైలజ, 38వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు వినోద్ రెడ్డి, కో క్లస్టర్ ఇంచార్జ్ విష్ణు ప్రియ, టిడిపి నాయకులు దాసరి రాజేష్, రియాజ్ , సాయి, రియాజ్, రాజేశ్వరి, సునీత, నెల్లూరు టౌన్ ఫ్రూట్స్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు , నెల్లూరు వెల్ఫేర్ ఫ్రూట్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story