Kondapuram: కొండాపురంలో ఘనంగా 'ఇంటింటికి తెలుగుదేశం'.. ఎమ్మెల్యే కాకర్ల

Kondapuram: కొండాపురం మండలం ఇస్కపాలెంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. రూ.3.85 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 July 2026 10:01 PM IST
Kondapuram
X

Kondapuram: కొండాపురంలో ఘనంగా 'ఇంటింటికి తెలుగుదేశం'.. ఎమ్మెల్యే కాకర్ల

కొండాపురం: కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ పరిధిలోని ఇస్కపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్‌తో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ముందుగా సాయిపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ సమాచార పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రూ.3.85 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సాయిపేట–కొమ్ముపాలెం తారురహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఇస్కపాలెంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రం (వాటర్ ప్లాంట్)ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆశయాలే తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా పార్టీ నాయకులు నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎనిమిది మండలాల పార్టీ కన్వీనర్లు, కూటమి నాయకులు, మహిళలు, యువత, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story