Nellore: నెల్లూరులో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సంబరాలు!
Nellore: నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Nellore: నెల్లూరులో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సంబరాలు!
Nellore: రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సంబరాలను జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. జిల్లా నలుమూలల నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా తరలివచ్చారు.
రెండేళ్లలో ప్రజలకు కల్పించిన నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేలా విజయోత్సవాలు ఏర్పాటు జరిగింది. ఈ విజయోత్సవ సంబరాలకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లాస్థాయి అధికారులు,
ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కస్తూరిదేవిగార్డెన్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి ఆనం, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా, లబ్ధి పొందిన ప్రజల విజయగాథలను ప్రతిబింబించిన శాఖల ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు.
జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులకు వివరించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆయా శాఖల అధికారులు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలుగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ప్రతీకగా విజయోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ విజయోత్సవ సభలో.. ప్రజలు, అధికారులు, సిబ్బంది పాల్గొనడంతో కస్తూరిదేవి గార్డెన్స్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.




