Kanigiri: కనిగిరిలో తీవ్ర ఉద్రిక్తత వైఎస్సార్ వర్ధంతి వద్ద రసాభాస!

Kanigiri: కనిగిరిలో వైఎస్సార్ వర్ధంతి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. జర్నలిస్టులపై దౌర్జన్యానికి పాల్పడిన ఎస్సై, ఏఎస్సైలపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల నిరసన ధర్నా.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Sept 2026 1:01 PM IST
Kanigiri
X

Kanigiri: కనిగిరిలో తీవ్ర ఉద్రిక్తత వైఎస్సార్ వర్ధంతి వద్ద రసాభాస!

Kanigiri: కనిగిరిలో తీవ్ర ఉద్రిక్తత.పోలీసులు జర్నలిస్టులపై దుర్భాసలాడిన ఎస్సై సందీప్ కుమార్, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిలను వెంటనే శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని చెక్ పోస్ట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పోలీసుల తీరుపై ఆగ్రహం.

కనిగిరిలో వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు అన్నదాన టెంట్లను తొలగించడంతో వైసీపీ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులను పోలీసులు వీడియోలు తీయవద్దంటూ దుర్భాసలాడారు. జర్నలిస్టు సెల్‌ఫోన్‌ను లాక్కున్న ASI శ్రీనివాసులరెడ్డి జర్నలిస్టులను దుర్భాసలాడారు. పోలీసుల తీరును నిరసిస్తూ కనిగిరిలో జర్నలిస్టులు ధర్నాకు దిగారు. పోలీసు జీపుకు అడ్డంగా కూర్చొని జర్నలిస్ట్ దానయ్య నిరసన తెలిపారు.

విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై దౌర్జన్యానికి పాల్పడ్డ SI సందీప్ కుమార్, ASI శ్రీనివాసులరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనిగిరిలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం వద్ద పోలీసుల చర్యలు, జర్నలిస్టుల నిరసనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story