Kaluvaya: సర్కారీ బడి పరీక్షల్లో కొత్త రూల్ ప్రత్యేక బుక్‌లెట్లు పంపిణీ!

Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం పరీక్షల నిర్వహణకు ప్రతి సబ్జెక్ట్‌కు ప్రత్యేక బుక్‌లెట్లను ఎంఈఓలు పంపిణీ చేశారు.

Madhav Goud, Nellore
Published on: 11 Aug 2026 4:16 PM IST
Kaluvaya
X

Kaluvaya: సర్కారీ బడి పరీక్షల్లో కొత్త రూల్ ప్రత్యేక బుక్‌లెట్లు పంపిణీ!

Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని హైస్కూల్ నుంచి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేక బుక్‌లెట్లను ఎంఈఓ-1 నవీన్ కుమార్, ఎంఈఓ-2 జనార్దన్ రెడ్డి పంపిణీ చేస్తున్నారు.

గతంలో విద్యార్థులు పాఠశాలల్లో నిర్వహించే ఎస్ఏ-1, ఎస్ఏ-2 వంటి పరీక్షలను సాధారణ పేపర్లపై రాసేవారు అయితే విద్యార్థులు రాసిన పరీక్షల వివరాలు భద్రంగా ఉండేలా ప్రభుత్వం ప్రతి సబ్జెక్ట్‌కు ప్రత్యేకంగా ఒక బుక్‌లెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది, ఇకపై పరీక్షలను ఈ బుక్‌లెట్లలోనే నిర్వహించనున్నారు.

పరీక్షలు పూర్తయిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో బుక్‌లెట్లపై సంతకాలు చేయించి తీసుకురావాలని అధికారులు సూచించారు, పేరెంట్స్ మీటింగ్‌ల సమయంలో ఈ నూతన విధానం గురించి తల్లిదండ్రులకు వివరించినట్లు తెలిపారు,ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన బుక్‌లెట్లను ఆయా సబ్జెక్ట్ టీచర్లు భద్రపరచాలని.

ఇతర మండలాల నుంచి వచ్చే విద్యాశాఖ అధికారులు వాటిని పరిశీలించే అవకాశం ఉంటుందని ఎంఈఓలు తెలిపారు,విద్యార్థుల పరీక్షల వివరాలను పద్ధతిగా భద్రపరచడంతో పాటు విద్యార్థుల ప్రతిభను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story