Nellore: కలువాయి ఎంపీపీ సమావేశం రసాభాస సాగునీరు, ఇళ్ల మంజూరుపై వాడివేడి చర్చ!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి MPP సర్వసభ్య సమావేశంలో సాగునీరు, హౌసింగ్ లబ్ధిదారుల ఎంపికపై వాడివేడి చర్చ. సోమశిల కాలువ నీటి విడుదలపై తీర్మానం.

Madhav Goud, Nellore
Published on: 2 Sept 2026 3:14 PM IST
Nellore
X

Nellore: కలువాయి ఎంపీపీ సమావేశం రసాభాస సాగునీరు, ఇళ్ల మంజూరుపై వాడివేడి చర్చ!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యం,పి,పి లక్ష్మీదేవి అధ్యక్షతన సాదారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు,రైతులకు సాగునీరు పై వాడి వేడిగా చర్చ కొనసాగింది.

ఈ సందర్బంగా జడ్పీటీసీ సభ్యులు అనీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కలువాయి చెరువు కింద 2వేల ఎకరాలు వరిసాగు చేస్తున్నారని ఇపుడు ప్రస్తుతం చెరువులో సగం నీరు మాత్రమే ఉందన్నారు, ఇంకా సుమారు 2నెలల పాటు వరి పైరు కోతకు వచ్చే పరిస్థితి లేదన్నారు.

జలాశయంలో 18 టీఎంసీలు మాత్రమే నీరు ఉందని,ఇప్పట్లో జలాశయానికి నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు,ఎలినో ప్రభావంతో వాతావరణం పూర్తి భిన్నంగా ఉందన్నారు, కలువాయి చెరువుకు దక్షిణ కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారని అవి రైతులకు పూర్తి స్థాయిలో సరిపోవడం లేదన్నారు.

5వందల క్యూసెక్కులకు పెంచే విధంగా సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి నెల్లూరు జిల్లా కలెక్టర్, సోమశిల జలాశయం ఎస్ ఈ కి నివేదిక పంపుతామన్నారు,ఇళ్ల మంజురు విషయంలో గ్రామసభ జరపకుండా జరిగినట్టు రికార్డులలో చూపించి హౌసింగ్ అధికారులు లబ్ది దారులను ఎంపిక చేయడంతో జడ్పీటీసీ అధికారుల పై అసహనం వ్యక్తం చేశారు,ఈ కార్యక్రమం లో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story