Nellore: పశువులకు సీజనల్ వ్యాధుల టీకాలు వేయించాలి ఏడీ గురు జయంతి

Nellore: కలువాయి పశువర్ధక శాఖ ఏడీ గురు జయంతి పశు రైతులకు కీలక సూచనలు చేశారు. వర్షాకాలంలో వ్యాధులు సోకకుండా టీకాలు వేయించాలని, మేత నిల్వ ఉంచుకోవాలని పిలుపు.

Madhav Goud, Nellore
Published on: 1 Aug 2026 3:36 PM IST
Nellore
X

Nellore: పశువులకు సీజనల్ వ్యాధుల టీకాలు వేయించాలి ఏడీ గురు జయంతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా కలువాయ మండలం లో వర్షాకాలం లో వచ్చే సీజనల్ వ్యాధులపై పశు రైతులు జాగ్రత్త లు తీసుకోవాలని కలువాయి పశువర్ధిక శాఖ ఏడి గురు జయంతి చెప్పారు. కలువాయి పశువర్ధక శాఖ కార్యాలయంలో ఆమె మీడియా తో మాట్లాడారు. రానున్న వర్షాకాలం లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.

పశువుల్లో వచ్చే గురక, గుదిపెట్టు వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున అవి సోకకుండా వ్యాధినిరోధిక టీకాలు వేయించుకోవాలని తెలిపారు. పశువులు ముఖ్యంగా ఆగస్టు నెల నుండి ఫిబ్రవరి వరకు ప్రసవ కాలం కావడంతో పశు పోషకులు ప్రసవ సమయంలో పశువుల పోషణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం తెలిపిన సూచనలు మేరకు ఎలినో ప్రభావంతో ఈ నెల 27 వరకు వర్షాలు ఉండవు అని తెలుపగా రైతులు ఈ నెల రోజులు పశువులకు అవసరం అయిన మెత్తను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని తెలియజేసారు.ఈ నెల నుండి ఎల్ ఎస్ డి వ్యాధి నిరోధికా టీకాలను వేయడం జరుగుతుందని ఆవులు ఉన్నc రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, రానున్న రోజుల్లో జీ రాంజీ ప్రోగ్రామ్ గడ్డి పెంపకం పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story