Vinjamuru: కలిగిరిలో ఏఎంఆర్ సంస్థపై ప్రజల తిరుగుబాటు!

Vinjamuru: నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణంలో ఏఎంఆర్ (AMR) సంస్థ తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 July 2026 2:35 PM IST
Vinjamuru
X

Vinjamuru: కలిగిరిలో ఏఎంఆర్ సంస్థపై ప్రజల తిరుగుబాటు!

వింజమూరు: నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణంలో ఏఎంఆర్ సంస్థ తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదివారం ఓ వ్యక్తి తన ఇంటి స్థలంలో పునాది కోసం మట్టి తరలిస్తుండగా,ఏఎంఆర్ సంస్థ సిబ్బంది అక్కడికి చేరుకుని రాయల్టీ పేరుతో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు స్థానికులు ఆరోపించారు.ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానికులు ఏఎంఆర్ సిబ్బందిని నిలదీస్తూ, ప్రభుత్వ జీవో ఏది వసూలు చేస్తున్న మొత్తాలకు అధికారిక రసీదులు ఇస్తున్నారా ఏ చట్టం ప్రకారం డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో ఏఎంఆర్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, ఇప్పటికే నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగిపోయాయని, అలాంటి పరిస్థితుల్లో ఇంటి పునాది కోసం మట్టి తీసుకోవడానికే అదనపు భారం మోపడం పేద, మధ్యతరగతి ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.అదే సమయంలో కోట్ల రూపాయల విలువైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వద్ద భారీ ఎత్తున మట్టి తరలింపులు జరుగుతున్నా అక్కడ మాత్రం నామమాత్రంగా కొద్ది ట్రిప్పులకు మాత్రమే రాయల్టీ వసూలు చేసి, మిగిలిన వాటిపై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

కొందరు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు.ఈ ఆరోపణలు నిజమైతే ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సామాన్య ప్రజలు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మట్టి తరలింపులో అనవసర ఇబ్బందులు, అక్రమ వసూళ్లు లేకుండా స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story