Jenasena: ఘనంగా జనసేన "అభివృద్ధి అడుగులు – సంక్షేమ వెలుగులు" ప్రచారం
Jenasena: జనసేన 'అభివృద్ధి అడుగులు-సంక్షేమ వెలుగులు' 4వ రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించి, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తూ మద్దతు కోరారు.
Jenasena: ఘనంగా జనసేన "అభివృద్ధి అడుగులు – సంక్షేమ వెలుగులు" ప్రచారం
జనసేన "అభివృద్ధి అడుగులు – సంక్షేమ వెలుగులు"
జనసేన చేపట్టిన అభివృద్ధి అడుగులు.. సంక్షేమం వెలుగులు.. కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు కూడారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో జనసేన పార్టీ నాయకులు
జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల,వారి సతీమణి,ఎఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ నాయకత్వంలో నగరంలో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల మెరుగుదల వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాహిత లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్తున్న పాలనకు ప్రజలు నిరంతరం మద్దతు అందించాలని కోరారు.
రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అభివృద్ధి, పారదర్శక పాలన కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్ కుమార్, విజయలక్ష్మి, ప్రవల్లిక, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, నాగేంద్ర బాలు, ప్రతాప్, నరహరి, మోహన కృష్ణారెడ్డి, దావూద్, మల్లికార్జున రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.




