Nellore: జనసేన నాయకుడు కిషోర్ గునుకులకు రాఖీలు కట్టిన వీర మహిళలు!
Nellore: నెల్లూరులో జనసేన నాయకుడు కిషోర్ గునుకులకు రాఖీలు కట్టిన వీర మహిళలు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని కిషోర్ పిలుపు.
Nellore: జనసేన నాయకుడు కిషోర్ గునుకులకు రాఖీలు కట్టిన వీర మహిళలు!
Nellore: రాఖీ పౌర్ణమి సందర్భంగా జనసేన పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన నాయకులు కిషోర్ గునుకుల నివాసంలో గత పదేళ్లుగా జనసేన పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న వీర మహిళలు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వీర మహిళలు కిషోర్ గునుకులకు రాఖీ కట్టి, ఆయనతో పాటు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ “జనసేన పార్టీ నాకు రాజకీయ పార్టీ మాత్రమే కాదు.. నాకు ఎంతో మంది అన్నదమ్ములను, అక్కాచెల్లెమ్మలను ఇచ్చిన కుటుంబం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం గత తొమ్మిదేళ్లుగా నాతో కలిసి నడిచిన ప్రతి సోదర సోదరీమణుల త్యాగం, కష్టం నాకు తెలుసు.
రాఖీ కట్టిన ప్రతి అక్కాచెల్లెమ్మకు ఒక అన్నగా, ఒక సోదరుడిగా ఎల్లప్పుడూ అండగా ఉంటాను. వారి కుటుంబాలు చల్లగా ఉండాలని, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన వారికి, ముఖ్యంగా గతంలో ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ కోసం పోరాడిన వారికి తగిన గుర్తింపు, సముచిత అవకాశాలు, కమిటీల్లో న్యాయం దక్కాలని కోరుకుంటున్నాను. ప్రతిభ, కష్టం, నిబద్ధతకు తగిన గౌరవం లభించినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుంది.
పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ప్రతి అక్కాచెల్లెమ్మతో, ప్రతి జనసైనికుడితో కలిసి మరింత బలంగా ముందుకు సాగుతాం.” అని కిషోర్ గునుకుల తెలిపారు.
రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు కట్టి అభినందనలు తెలిపిన ఆడపడుచులకు చీరలు అందజేసి, వారు మరియు వారి కుటుంబాలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కిషోర్ గునుకుల ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన మాజీ జిల్లా సమాఖ్య కార్యదర్శి సుకన్య, లీగల్ సెల్ నాయకురాలు శుభాషిణి, పట్టణ కార్యదర్శి హేమ, నగర కార్యదర్శి కృష్ణవేణి, లత, ప్రవల్లిక, రజని, నందిని తదితర వీర మహిళలు, జనసేన నాయకులు పాల్గొన్నారు.




