Nellore: నెల్లూరు: 170 మంది క్యాన్సర్ బాధితులకు పోషకాహార పంపిణీ!
Nellore: నెల్లూరు రూరల్ కొండాయపాలెంలో అబైండింగ్ హోప్ చర్చి ఆధ్వర్యంలో 170 మంది క్యాన్సర్ బాధితులకు పోషకాహారం, భోజనం పంపిణీ చేశారు.
Nellore: నెల్లూరు: 170 మంది క్యాన్సర్ బాధితులకు పోషకాహార పంపిణీ!
నెల్లూరు: నెల్లూరు రూరల్, కొండాయపాలెం: అబైండింగ్ హోప్ చర్చి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ చేపడుతున్న నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా.... సుమారు 170 మంది క్యాన్సర్ బాధితులకు పోషకాహారం, భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల హాజరై బాధితులకు పోషకాహారం, భోజనం అందజేశారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి వైద్య చికిత్సతో పాటు మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆశాభావం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి నెలా క్యాన్సర్ బాధితులకు పోషకాహారం అందిస్తూ వారి ఆరోగ్యానికి, ఆత్మస్థైర్యానికి అండగా నిలుస్తున్న ప్రొఫెసర్ టైటస్ నిర్మల్ కుమార్ గారి సేవలను అభినందించారు.
ఈ రోజు మనం కేవలం పోషకాహారం అందించడం కోసం ఇక్కడికి రాలేదు. ‘మీరు ఒంటరిగా లేరు.. మీతో మేమున్నాం’ అనే నమ్మకాన్ని, ఆశను, ధైర్యాన్ని అందించడానికి వచ్చామని భరోసా ఇచ్చారు.
క్యాన్సర్ బాధితులకు ధైర్యం చెబుతూ ఆయన మాట్లాడారు “మనం గడిపే ప్రతి రోజూ భగవంతుడు ఇచ్చిన వరం అని, మన బాధ్యత పూర్తయ్యే వరకు మన ప్రయాణం ఆగదని, ఎన్నో కష్టాలను చూసినా..ఆశను మాత్రం వదులుకోవద్దని, మీ బాధ్యతను గుర్తించి ధైర్యంగా ముందుకు సాగండి అంటూ బాధితుల్లో మనోధైర్యం నింపారు.
“ఆశ (Hope) అనేది కేవలం ఒక మాట కాదు… మరో రోజు పోరాడేందుకు మనకు బలాన్నిచ్చే శక్తి.” అని అన్నారు. అనంతరం తన గురువైన డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ సేవా స్ఫూర్తిని, రాజకీయ గురువు పవన్ కళ్యాణ్ ప్రజాసేవా మార్గాన్ని కిషోర్ గునుకుల గుర్తుచేశారు.
విద్యాబుద్ధులు, సేవా స్ఫూర్తిని నేర్పించిన గురువు డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ గారు, రాజకీయ గురువు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ చూపించిన మార్గం ఒక్కటే: ప్రజాసేవే పరమ ధర్మం.” అని అన్నారు. "చుట్టూ బాంబులు పడుతున్నా… తన ప్రాణం కంటే తనతో ఉన్నవారి భద్రతకే ప్రాధాన్యత ఇచ్చిన నిర్మల్ కుమార్ సేవా నిబద్ధత ఆదర్శనీయం అని కొనియాడారు.
“అదే జనసేన పవర్… అదే పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తి” అని కిషోర్ గునుకుల అన్నారు. ఆపదలో ఉన్నప్పుడు మనిషికి మనిషి అండగా నిలవాలని, ఎక్కడ కన్నీరు ఉంటే అక్కడ మన చేయి అందించాలని, ఎక్కడ నిరాశ ఉంటే అక్కడ మన మాట ధైర్యం ఇవ్వాలని అన్నారు.
వ్యాధి మీ శరీరాన్ని పరీక్షించవచ్చు… కానీ మీ ధైర్యాన్ని ఓడించకూడదు. ఈ పోరాటంలో మీరు ఒంటరిగా లేరు.. సమాజం మీకు అండగా ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న పోషకాహారం, భోజనం కేవలం ఆహారం మాత్రమే కాదని, బాధితులకు ‘మీ పోరాటంలో మేము మీతో ఉన్నాం’ అనే భరోసాను అందించే మానవీయ స్పర్శ అని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.
టైటస్ నిర్మల్ కుమార్ చేపడుతున్న నిరంతర సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, మరెందరో బాధితులకు అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి, మరింత కాలం ప్రజలకు సేవ చేసే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు.
“మన దగ్గర ఉన్నదంతా గొప్పది కాదు… మన దగ్గర ఉన్నదాన్ని అవసరమైన వారికి పంచడమే గొప్పది.” అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి అవకాశం కల్పించిన అబౌండింగ్ హోప్ చర్చి నిర్వాహకులకు, డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ కి, జనసేన నాయకులు, కార్యకర్తలు, సేవాభిమానులకు కిషోర్ గునుకుల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, సేవాభిమానులు పాల్గొని క్యాన్సర్ బాధితులకు తమ మద్దతు తెలిపారు.




