Nellore: రాపూరులో "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం నిర్వహణ!
Nellore: రాపూరులో "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో సూపర్ సిక్స్ పథకాలపై మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి ప్రచారం.
Nellore: రాపూరులో "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం నిర్వహణ!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమ పాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు రాపూరు పట్టణంలో సోమవారం “ఇంటింటికీ టీడీపీ” కార్యక్రమం నిర్వహించారు.
పట్టణంలో ని అరుంధతి వాడ, కొత్త హరిజన వాడ, తూర్పు అగర్త కట్టలో మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. “సూపర్ సిక్స్” పథకాలు ప్రతి కుటుంబానికి సక్రమంగా అందుతున్నాయో లేదో నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చెన్ను అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో రాపూరు మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నల్ల వడ్ల వెంకటరమణ రెడ్డి ఎస్.కె ముక్తార్ పఠాన్ చాన్ బాషా మాలేపాటి వెంకటరమణ రెడ్డి చెన్ను పెంచల్ రెడ్డి నల్ల వడ్ల భాస్కర్ రెడ్డి వినయ్ రెడ్డి ఏటూరు శ్రీనివాస్ రెడ్డి చిలికం ప్రసాద్ రెడ్డి సమయం ప్రసాద్.. పచ్చి గల్ల రత్నయ్య కూనిపోగు కన్నయ్య కొండాపురం కస్తూరి. నరికే అమ్ములు.. చిలువూరు రవణమ్మ లక్కాకుల భాస్కర్ నాయుడు షేక్ అహ్మద్ షేక్ అప్సర్ షేక్ సికిందర్.. వేమయ్య.. వెంకటేష్ భారీ సంఖ్యలో టిడిపి పట్టణ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.




