Nellore: రోగుల వసతి కోసం కొత్త భవనం.. ఐఆర్‌సీఎస్ చైర్మన్

Nellore: నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

V. Narasimhulu, Nellore
Published on: 13 May 2026 9:11 PM IST
Nellore
X

Nellore: రోగుల వసతి కోసం కొత్త భవనం.. ఐఆర్‌సీఎస్ చైర్మన్

Nellore: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్‌లో ఈ రోజు తేదీ 13-05-2026 న నూతన భవన నిర్మాణానికి సంప్రదాయబద్ధంగా భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాతలు, జీవితకాల సభ్యులు, మేనేజింగ్ కమిటీ సభ్యులు, వైద్యులు, కన్సల్టెంట్లు, సిబ్బంది, శ్రేయోభిలాషులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐఆర్‌సీఎస్ జిల్లా శాఖ ఛైర్మన్ వాకాటి విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “ఐఆర్‌సీఎస్ క్యాన్సర్ హాస్పిటల్ గత 25 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా మరియు పరిసర ప్రాంతాల వేలాది మంది రోగులకు నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని, ప్రస్తుతం ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని జరుపుకుంటుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చేపడుతున్న నూతన భవన నిర్మాణం మా సేవా కార్యక్రమాల్లో మరో ముఖ్యమైన అడుగు అని,

నూతన భవనం ప్రధానంగా ఆసుపత్రికి చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే క్యాన్సర్ రోగులు మరియు వారి సహాయకుల కోసం వసతి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో నిర్మించబడుతోందని చెప్పారు. ఈ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత రోగులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందడంతో పాటు ఆసుపత్రి సేవల విస్తరణకు కూడా దోహదపడనుందని చెప్పారు.

దాతలు, శ్రేయోభిలాషులు అందిస్తున్న సహకారంతో భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో సేవలు అందిస్తామని తెలియచేసారు. ఈ సందర్భంగా దాతలు ఆసుపత్రి యాజమాన్యం చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, రోగుల సేవల విస్తరణకు తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దాతలు బి. శ్రీహరి రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, డాక్టర్ రజని, ధర్మేంద్ర జైన్, సుమంత్ కుమార్ రెడ్డి, మాజీ ఛైర్మన్ డాక్టర్ ఏ.వి. సుబ్రహ్మణ్యం, హాస్పిటల్ కోఆర్డినేటర్లు యాలమూరి రంగారావు, కలికి శ్రీహరి రెడ్డి, ఐఆర్‌సీఎస్ జిల్లా శాఖ కోశాధికారి సురేష్ కుమార్ జైన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద్, బయ్యా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story