Nellore: హిందూ సామ్రాజ్య దినోత్సవం.. శివాజీ విగ్రహానికి ఘన నివాళి!
Nellore: హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా నెల్లూరులో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి.
Nellore: హిందూ సామ్రాజ్య దినోత్సవం.. శివాజీ విగ్రహానికి ఘన నివాళి!
Nellore: హిందూ సామ్రాజ్య దినోత్సవం వేడుకల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి సురేందర్ రెడ్డి, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కొండపల్లి శ్రీకాంత్, రంగనాథ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కేవీ సుబ్రమణ్యం, మరాఠా మిత్రమండలి సభ్యులు శివాజీ సెంటర్ సభ్యులు,ఆదివారం స్థానిక ట్రంకు రోడ్డు వద్దనున్న శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతు.. భారతీయ మహిళల గౌరవానికి ప్రపంచ స్థాయిలో నిలిపిన చత్రపతి శివాజీ మహారాజ్ మహారాజా రాణా ప్రతాప్ లు ఆదర్శప్రాయులని పేర్కొన్నారు. వారిని స్మరించుకోవడం వారి ఆశయాలను అనుసరించి భారత స్వాతంత్ర ఫలాలను ప్రజలందరికీ అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ రంగరాజన్, శివకుమార్ రెడ్డి, హర్షవర్ధన్, జివిటి ప్రభాకర్, స్వామి పలువురు హిందూ అభిమానులు శివాజీ సేన సభ్యులు పాల్గొన్నారు.




