Gudur: ఇన్నర్ వీల్ క్లబ్ దాతృత్వం.. దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ!

Gudur: గూడూరు ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో "రెడ్ సంస్థ" ఆధ్వర్యంలో పట్టణంలోని దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 5 July 2026 4:44 PM IST
Gudur
X

Gudur: ఇన్నర్ వీల్ క్లబ్ దాతృత్వం.. దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ!

గూడూరు: పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో, ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ విల్ క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో "రెడ్ సంస్థ" ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందించారు.... నేటి కార్యక్రమానికి డాక్టర్ రోహిణి నిర్మల ఆర్థిక సహాయం అందించారు

సంస్థ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ...

మహిళా మండలి సభ్యుల సహకారంతో ప్రతినెల సరుకులు అందిస్తున్నామని, దివ్యాంగులు మనో వేదనతో దిగులు చెందకుండా, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు...

భవిష్యత్తులోనూ దివ్యాంగులకు అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని, నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం గా కొనసాగుతుందని, ఇందుకోసం దాతలు ఎంతోమంది తమ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారని, మానవత్వం బ్రతికే ఉందనడానికి మంచితనం ఇంకా మిగిలే ఉందనడానికి ఇలాంటి కొన్ని కార్యక్రమాలు సాక్ష్యంగా నిలుస్తాయని చెప్పారు డాక్టర్ రోహిణి ...

ఈ కార్యక్రమంలో సుప్రియ, పవిత్ర ,లక్ష్మి ,మాధురి ,స్నేహలత, పరంజ్యోతి, నారాయణ కార్తికేయ, సుధీర్ ,వెంకటేశ్వర్లు ,శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story