Rapur: సామాజిక బాధ్యత చాటుకున్న రాపూరు గుడ్ షెపర్డ్ స్కూల్ విద్యార్థులు!

Rapur: రాపూరు గుడ్ షెపర్డ్ పాఠశాల విద్యార్థుల ఉదారత.. అంధుల సంక్షేమం కోసం స్వర్ణ దీపం ట్రస్ట్‌కు రూ.16,896 విరాళం అందజేత.

Yellayya, Nellore
Published on: 12 Sept 2026 7:30 AM IST
Rapur
X

Rapur: సామాజిక బాధ్యత చాటుకున్న రాపూరు గుడ్ షెపర్డ్ స్కూల్ విద్యార్థులు!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు తమ ఉదారతను చాటుకున్నారు. అంధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ అంధుల సహాయార్థం మద్దతుగా విద్యార్థులు రూ. 16,896 నగదును సేకరించారు.​

ఈ విరాళం మొత్తాన్ని శుక్రవారం సాయంత్రం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఫౌండేషన్ ప్రతినిధులకు స్వయంగా అందజేశారు.​ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, విద్యార్థుల్లో చిన్నతనం నుంచే సేవా భావాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

దృష్టి లోపం ఉన్నవారికి చేయూతనందించేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చిన విద్యార్థులను, వారికి సహకరించిన తల్లిదండ్రులను పాఠశాల యజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు సమాజం పట్ల మానవీయ దృక్పథం పెరుగుతుందని పేర్కొన్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore