Nellore: రొట్టెల పండుగకు పోటెత్తిన భక్తులు.. ట్రాఫిక్ జామైన నెల్లూరు
Nellore:రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధమహోత్సవం కన్నులపండువగా ముగిసింది. ఆదివారం తెల్లవారుజాము నుండి స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి ప్రక్రియ ఊపందుకుంది.
Nellore: రొట్టెల పండుగకు పోటెత్తిన భక్తులు.. ట్రాఫిక్ జామైన నెల్లూరు
నెల్లూరు: నెల్లూరులో జరుగుతున్న బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టం గందోత్సవం ముగిసింది.
అధికారికంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది... రొట్టెల పండుగలో... అతి ప్రాముఖ్యమైన వేడుక గంధమోత్సవం.. అర్ధరాత్రి కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి ప్రారంభమై.. కడప దర్గా పీఠాధిపతులు... మత పెద్దలు ప్రార్థనలు చేసి.. తహలీల..
ఊరేగింపుతో... సుగంధ ద్రవ్యాలతో... కలిపిన గంధ కలిశాన్ని... మేళ తాళాలు, బాణాసంచా లో ,మధ్య ఊరేగింపుగా బారా షాహీద్ దర్గాకు తీసుకువచ్చారు..
అనంతరం కడప పీఠాధిపతిచే ఆయన శిష్య బృందం, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, బారా షాహిద్ సమాధులకు గ్రంధాన్ని లేపనం చేశారు.. వెనువెంటనే భక్తులకు గంధం పంపిణీ చేశారు... బారాషాహితుల గంధ కలశాన్ని అందుకునేందుకు లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు, దర్గా వద్దకు చేరడంతో ప్రతి ఏర్పడింది.
పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులను క్రమ పద్ధతిలో, దర్గా వద్ద క్యూ లైన్ల వైపు మళ్లించి, గంధాన్ని అందించేందుకు మార్గం సుగమం చేశారు.
మరోవైపు ఇవాళ ఆదివారం కావడం గందోత్సవంలో కీలక ఘట్టమైన, రొట్టెల మార్పిడి కొనసాగుతూ ఉండడంతో.. దర్గాకు వచ్చే భక్తులు సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
మండుటెండను సైతం లెక్కచేయకుండా లక్షలాదిమంది, క్యూలలో బారులు తీరి, బారా షాహిద్ ల దర్గాను దర్శించుకుని, గంధాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అధిక సంఖ్యలో భక్తులు పర్యాటకులు హాజరుకానుండడంతో, నగరంలో మరింత పెరిగిన రద్దీ పెరిగింది. నెల్లూరు నగరం దాదాపుగా వాహనాల దిగ్బంధనంలో చిక్కుకుంది.
నలువైపుల నుంచి వచ్చే వాహనాలన్నీ దర్గా వైపు మళ్లడంతో పొదలకూరు రోడ్డు గ్రాండ్ ట్రంకు రోడ్డు నెక్లెస్ రోడ్డు... మినీ బైపాస్ రోడ్డు సహా ప్రధాన రహదారులు వాహనాలతో నిండిపోయాయి. అడుగడుగునా రాకపోకలు స్తంభించిపోతున్నాయి.
పరిస్థితిని ముందు నుంచి గమనిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున పోలీసులను పహారాగా ఏర్పాటు చేశారు.




