Rapur: రాపూరు ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం
Rapur: రాపూరులో లలితమ్మ భాస్కరరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం. రెండు జిల్లాల్లో ఇటువంటి మరిన్ని శిబిరాలు నిర్వహిస్తామన్న ట్రస్ట్ సీఈవో సీతారామ నాయుడు.
Rapur: రాపూరు ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం
రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు షాదీ మంజిల్‌లో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వైద్య బృందం పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.అనంతరం ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో సీతారామ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.
నెల్లూరు,తిరుపతి జిల్లాల ప్రతి మండలంలో ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని,అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు.
Next Story




