Atmakur: ఆత్మకూరులో 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఉచిత వైద్య శిబిరం!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అభిరామ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ. ప్రజలకు ఉచిత మందులు పంపిణీ.

TS Murthy, Atmakuru(Nellore)
Updated on: 15 Aug 2026 5:27 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఉచిత వైద్య శిబిరం!

Atmakur: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అభిరామ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎండి డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి,డాక్టర్ మేకపాటి దీప్తి రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 3వ వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

షుగర్, థైరాయిడ్, బీపీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసి పలువురు రోగులకు తగిన వైద్య సలహాలు అందించారు. ఈ సందర్భంగా అభిరామ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోడూరు శ్రావణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం అభిరామ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రాంతంలో నిరంతరం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.అలాగే యువత అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

రోడ్డుపై ఎవరైనా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఎలా స్పందించాలి, ప్రాణాలను కాపాడేందుకు ఏం చేయాలి అనే అంశాలపై యువతకు శిక్షణతో పాటు సీపీఆర్ శిక్షణ అందిస్తామని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సుభాష్ ఎంబీబీఎస్,డీఎంవో, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story