Kaluvaia: కలువాయిలో ప్రపంచ జూనోసిస్ డే.. ఉచితంగా రేబిస్ టీకాలు!
Kaluvaia: జూనోసిస్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా కలువాయి మండలం పశు వైద్యశాలలో కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేసినట్లు పశుసంవర్థక శాఖ ఏడీ గురు జయంతి తెలిపారు.
Kaluvaia: కలువాయిలో ప్రపంచ జూనోసిస్ డే.. ఉచితంగా రేబిస్ టీకాలు!
Kaluvaia: ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా సోమవారం కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ ఏడీ గురు జయంతి తెలిపారు.నెల్లూరు జిల్లా కలువాయి మండలం పశు వైద్యశాలలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులను జూనో టిక్ వ్యాధులుగా గుర్తించినట్టు తెలిపారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనుషులకు సుమారు 60 శాతం జూనోసిస్ వైరస్ వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు. వాటి నుంచి కాపాడుకోవడానికి యాంటీ రేబిస్ టీకాలను పశువైద్యశాలలో ఉచితంగా వేయనున్నట్టు తెలిపారు.ఇవి మండలంలోని అన్ని పశు వైద్యశాలలలో అందుబాటులో ఉంది దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం ఆమె కొన్ని జంతువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కొండయ్య, శ్రీకాంత్ ఉన్నారు.
Next Story




