Nellore: వింజమూరు మండలంలో పిడుగుల బీభత్సం.. గేదెలు మృత్యువాత
Nellore: వింజమూరు మండలంలో పిడుగుపాటుకు నాలుగు గేదెలు మృతి చెందాయి. లెక్కలవారిపాలెం, పాతూరులలో రూ.2.80 లక్షల నష్టం వాటిల్లడంతో పాడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
Nellore: వింజమూరు మండలంలో పిడుగుల బీభత్సం.. గేదెలు మృత్యువాత
నెల్లూరు: వింజమూరు మండలంలో సోమవారం సాయంత్రం పిడుగులతో కూడిన వర్షం కురవడంతో రెండు వేర్వేరు ఘటనల్లో నాలుగు గేదెలు పిడుగుపాటుకు మృతి చెందాయి. దీంతో పాడి రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.మండలంలోని లెక్కలవారిపాలెం గ్రామానికి చెందిన పాడి రైతు సుభాష్ అమ్మకు చెందిన రెండు గేదెలు పిడుగుపాటుకు మృతి చెందాయి.
మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు.అదేవిధంగా వింజమూరు పాతూరుకు చెందిన రైతు మల్లాల గోపాల్‌రెడ్డికి చెందిన రెండు గేదెలు సైతం పిడుగుపాటుకు మృతి చెందాయి.వీటి విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుందని రైతు తెలిపారు.
ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనలతో పాడి రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నాలుగు గేదెలు మృతి చెందడంతో మొత్తం రూ.2.80 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధిత రైతులకు పరిహారం అందించాలని వారు కోరుతున్నారు.




