Nellore: నెల్లూరుకు విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి సీఎం ఇబ్రహీం!
Nellore: నెల్లూరు పర్యటనకు విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి సీఎం ఇబ్రహీం సాబ్. SIR ప్రక్రియలోని లోటుపాట్లు, ముస్లింలు-మైనార్టీలకు కలిగే ఇబ్బందులపై అవగాహన కార్యక్రమం.
Nellore: నెల్లూరుకు విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి సీఎం ఇబ్రహీం!
Nellore: మాజీ కేంద్ర మంత్రి సీఎం ఇబ్రహీం సాబ్ నెల్లూరుకు రావడం మనందరికీ గర్వకారణమని, అదృష్టమని అన్నారు మౌలానా ఇమ్రాన్ సూఫీ.
సీఎం ఇబ్రహీం సాబ్‌కు మాజీ ప్రధాని దేవేగౌడ, స్వర్గీయ ఎన్టీ రామారావు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ వంటి ప్రముఖ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం ఇబ్రహీం సాబ్ దేశంలోనే అత్యుత్తమ నాయకుల్లో ఒకరని ప్రశంసించారు. ప్రజల కోసం అనేక త్యాగాలు చేసి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, జైలు జీవితం కూడా అనుభవించి, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. SIR ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడమే సీఎం ఇబ్రహీం సాబ్ నెల్లూరు పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
SIR ప్రక్రియలో ఉన్న లోటుపాట్ల కారణంగా ముస్లింలు, క్రైస్తవులు, ఇతర వర్గాల ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో SIRపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మన కమ్యూనిటీలోని మాస్ లీడర్లు, సామాన్య ప్రజలు SIR ప్రక్రియను అర్థం చేసుకుని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.
ఇంతటి పెద్ద నాయకుడిని నెల్లూరుకు తీసుకువచ్చిన మౌలానా ఇమ్రాన్ సూఫీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు టీవీ, సోషల్ మీడియా ద్వారా గమనిస్తున్నారని అన్నారు. విద్యార్థులపై జరుగుతున్న దాడులు, హింసను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించాలని భావించినప్పటికీ అనుమతులు లభించకపోవడంతో గెట్-టుగెదర్ కార్యక్రమంగా నిర్వహించాల్సి వచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పెద్దలు, నాయకులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం ఇబ్రహీం సాబ్‌కు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.




