Nellore: ఎంపీ వేమిరెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు!

Nellore: కూటమి పాలనలో నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ఆధ్వర్యంలో భారీ మైనింగ్ సిండికేట్ నడుస్తోందని, దమ్ముంటే సీబీఐ విచారణకు రావాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 30 Aug 2026 5:25 PM IST
Nellore
X

Nellore: ఎంపీ వేమిరెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు!

నెల్లూరు: కూటమి పాలనలో నెల్లూరు జిల్లాలో మైనింగ్ సిండికేట్ నడుస్తుందని, కాలం చెల్లిన మైన్స్ తో ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఖనిజాల దోపిడీ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి వైసిపి నాయకుడు అనిల్ కుమార్ యాదవ్.

వైసిపీ హయాంలో పెద్ద ఎత్తున మైనింగ్ అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారని, మైనింగ్ అక్రమాలకు పాల్పడి వుంటే తనపై సిబిఐ విచారణ జరపాలని, మైనింగ్ పర్మిట్ల రూపంలో తమ హయాంలో ప్రభుత్వానికి 55 కోట్లు ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. అదే ఈ కూటమి పాలనలో 7 కోట్లు, 12 కోట్లు మాత్రమే వసూళ్ళు అయ్యాయని, గూడూరు నియోజకవర్గంలో మైనింగ్ యజమానులు బెదిరించి అక్రమ వసూళ్ళుకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టన్నుకు 8 వేల నుండి 15 వేలు వసూళ్ళు చేస్తున్నారని, ఏ మైనింగ్ యజమాని ఎక్స్ పోర్ట్ చేయాలి అన్నా ఖచ్చితంగా ఈ కూటమి ఎంపీ అనుచరులకు శిస్తు కట్టాల్సిందేనని, ఈ మైనింగ్ సిండికేట్ ఎంపీ వేమిరెడ్డి అధ్యక్షతనే నడుస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఫినీ క్వార్ట్జ్ అనే కంపెనీ పేరుతో ఎంపీ వేమిరెడ్డి అనుచరుడు విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వసూళ్ళు జరుగుతున్నాయని,

చైనా కు సంబంధించిన డౌ అనే వ్యక్తిని తీసుకొచ్చి అతనికే ఎక్స్పోర్ట్ చేయాలి అని హుకుం జారీ చేశారని, ఒక చైనా వ్యక్తిని ఏపికి తీసుకొచ్చి ఈ తరహా బెదిరింపులకు పాల్పడటం నిజంగా దేశ ద్రోహం అని చెప్పారు.తన ఆరోపణల్లో నిజం లేకపోతే ఎంపీ వేమిరెడ్డి అవాస్తవాలు అని సమాధానం ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు.

వేమిరెడ్డికి ఈ అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో సంబంధం లేకపోతే సిబిఐ విచారణకు అంగీకరించాలని, నేడు వీరి అక్రమ సంపాదనకు నష్టపోతున్న మైనింగ్ యజమానులు దాదాపు టిడిపీ జెండా మోసిన వారేనని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story