Nellore: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆరోపణలు!
Nellore: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆరోపణలు. క్వార్ట్జ్ మైన్స్ అక్రమాలు, చైనా వ్యాపారితో బంధంపై ప్రశ్నలు.
Nellore: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆరోపణలు!
Nellore: క్వార్జ్ మైన్స్ లో జరిగిన అక్రమ దందాపై పాలక, ప్రతిపక్ష పార్టీల నడుమ పరస్పర విమర్శల నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరింతగా వేడెక్కాయి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై చేసిన మైన్స్ లో అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ కు కౌంటర్ ఇచ్చారు దానికి ధీటుగా ఈరోజు జిల్లా వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
చైనా కు చెందిన వ్యాపారి యాంగ్జున్ డవ్ తో ఆగడాలు జరుగుతున్నాయని,ఇందులో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రమేయం ఉందని తాను ప్రశ్నించానని, నెల్లూరు లోని సన్ షైన్ అపార్ట్మెంట్ వేదికగా అక్రమ మైనింగ్ లావాదేవీలు జరిగాయని ఆరోపించారు మైన్స్ పై ఆధారాలు బయట పెట్టాక ప్లాట్ ఖాళీ చేశారని చెప్పారు ఆరోపణలపై ఎంపి ప్రభాకర్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని, ఎంపి కి యాంగ్జున్ డవ్ కి సంబంధం ఏమిటి..?అని ప్రశ్నించారుకేంద్రమంత్రి జయ్ శంకర్ కి విపిఅర్ లేఖ రాశారని, చైనా కి చెందిన ఐదుగురికి వీసా ఇవ్వాలని లేఖ రాశారని , అందులో యాంగ్జున్ డవ్ పేరు కూడా ఉందని చెప్పారు ఇల్లీగల్ మైన్స్ తో యాంగ్జున్ డవ్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు.




